ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ పదవీకాలంలో ఆయన చేసిన ప్రసంగాలు, ప్రయాణాలు, తీసుకున్న చర్యలను కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, ఛేంజింగ్ పేరుతో కేంద్ర సమాచార ప్రసారశాఖ తీసుకొచ్చిన పుస్తకాన్ని రాజ్‍నాథ్‍సింగ్, కేంద్ర మంత్రి ప్రకాశ్‍జావడేకర్‍లు ఇటీవలే ఆవిష్కరించారు. అలాగే రాజ్యసభ చైర్మన్‌గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పార్లమెంటు ఆవరణలో ‘రుద్రాక్ష’ మొక్కను నాటారు.
రాజ్యసభ చైర్మన్‌గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో పార్లమెంటు ఆవరణలో ‘రుద్రాక్ష’ మొక్కను నాటడం ఆనందాన్నిచ్చింది. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. వన మహోత్సవాలను ‘జనమహోత్సవాలు’ గా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని ఆకాంక్షిస్తున్నాను.
వృక్షో రక్షతి రక్షితః pic.twitter.com/2lAwcKPpKT— Vice President of India (@VPSecretariat) August 13, 2020
‘రుద్రాక్ష’ మొక్కను నాటడం ఆనందాన్నిచ్చిందన్నారు. అలాగే ‘పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. వన మహోత్సవాలను ‘జనమహోత్సవాలు’ గా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని ఆకాంక్షిస్తున్నాను. వృక్షో రక్షతి రక్షితః’ అని ఆయన ట్వీట్ చేశారు.