ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మెహదీపట్నంలోని నందమూరి హరికృష్ణ నివాసానికి చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నందమూరి కుటుంబంతో నాకు రాజకీయాలతో సంబంధం లేకుండా.. ఆత్మీయ సంబంధం ఉంది. హరికృష్ణ ముక్కుసూటి మనిషి, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో చిత్తశుద్ధితో పనిచేసే మనస్తత్వం గల దుర్మరణం చెందడం చాలా బాధాకరం. నాడు రాజ్యసభలో తెలుగులో మాట్లాడతానని హరికృష్ణ కోరగా అప్పటి సభాపతి అనుమతి ఇవ్వలేదు. దీంతో నేను కలుగజేసుకుని హరికృష్ణకి అనుమతి ఇవ్వండి..కావాలంటే నేను మీకు ట్రాన్సలేట్ చేస్తాను అని నాటి సభాపతిని వెంకయ్యనాయుడు తాను ఒప్పించానని పేర్కొన్నారు.
తండ్రికి తగ్గతనయుడిగా తెలుగు జాతి ఆధరణ పొందగలిగాడు, పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజాభిమానాన్ని ఆయన సంపాదించుకోగలిగారు.. నమ్మిన సిద్ధాంతం కోసం కడదాక నిలబడే వ్యక్తిత్వం గల వ్యక్తి హరికృష్ణ అంటూ ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన సమయంలోనూ తెలుగు వారికి కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది అంటూ హరికృష్ణ తీవ్ర ఆవేదన చేందారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తుచేసుకున్నారు. ఏది ఏమైన హరికృష్ణ మరణించడం చాలా బాధాకరం అన్నారు.