ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం ఉదయం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. రాజేంద్రనగర్ లో జాతీయ గ్రామీణావృద్ధి, పంచాయితీరాజ్ సంస్థ(ఎన్ఐఆర్డీపీఆర్)లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న రూరల్ ఇన్నోవేటర్స్ స్టార్టప్ కన్ క్లేవ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో జౌత్సాహిక యువకులు రూపొందిస్తున్న వివిధ రకాల వస్తువులకు బహుళ ప్రచారం కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్ఐఆర్డీపీఆర్ డైరెక్టర్ జనరల్ డా. డబ్లూ ఆర్ రెడ్డి తెలిపారు. మొత్తం 23 రాష్ట్రాలకు చెందిన 182 మంది వివిధ స్టాళ్లను ఏర్పాటు చేస్తారని వివరించారు. దీంతో నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.