టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న కపట రాజకీయాలకు కాలం చెల్లిందని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని స్పష్టంచేశారు. స్థానిక తన కార్యాలయంలో ఎమ్మెల్యే విడదల రజిని శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కె. అచ్చన్నాయుడు అధికారాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ హయాంలో అడ్డగోలు అవనీతికి పాల్పడ్డారని తెలిపారు. దాదాపు రూ.150 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డట్టు ఏసీబీ అధికారుల వద్ద అన్ని సాక్షాధారాలు ఉన్నాయని చెప్పారు. విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డవారిని అరెస్టు చేయక సత్కరిస్తారా..? అని ప్రశ్నించారు. మోసం చేసిన అచ్చెన్నాయుడును చట్టం ప్రకారం అరెస్టు చేస్తే.. ఇదేదో బీసీలను అణగదొక్కే చర్యగా, బీసీలకు ద్రోహం చేస్తున్నట్లుగా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్, ఆ పార్టీ నాయకులంతా కులం రంగుపులమాలని తెగ తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు.