చిన్న వ్యాపారులకు కేంద్రం బంపర్ న్యూస్…!

-

లాక్ డౌన్ లో భారీగా నష్టపోయిన వారిలో చిన్న వ్యాపారులు ముందు ఉంటారు. వారు పడుతున్న కష్టం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. లాక్ డౌన్ లోవారి కోసం కేంద్రం పలు ప్యాకేజీ లను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా సరే వారి వ్యాపారాలు మాత్రం గాడిలో పడే సూచనలు అయితే కనపడటం లేదు అనే చెప్పాలి. తాజాగా వారికి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 40వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేడు ఢిల్లీ లో జరిగింది. జీఎస్టీ రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేసినట్లయితే అదనపు చార్జీలను వసూలు చేసేది లేదని ప్రకటించింది. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చింది. వస్తువులపై జిఎస్‌టి రేట్లు పెంచితే అది వారి డిమాండ్‌ను మరింత తగ్గిస్తుందని కౌన్సిల్ భావించింది. అది ఆర్థిక పునరుద్ధరణకు ఆటంకంగా మారుతుందని పేర్కొన్నారు సభ్యులు.

ఈ నేపధ్యంలోనే లాక్ డౌన్ తర్వాత డిమాండ్ పెరిగే విధంగా చూడాలి అని వ్యాపారాలను మరింతగా పెంచాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొత్తం టర్నోవర్ రూ .5 కోట్ల వరకు ఉన్న చిన్న పన్ను చెల్లింపుదారులకు 2020 మే నాటికి, మే, జూన్, జూలై నెలల్లో అవసరమైన సామాగ్రి కోసం జిఎస్‌టిఆర్ -3 బి ఫారమ్‌ను దాఖలు చేస్తే ఆలస్య రుసుముతో పాటుగా వడ్డీ కూడా మాఫీ చేస్తామని అలాగే 18 శాతం నుంచి 9 శాతానికి జీఎస్టీ తగ్గిస్తామని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version