తెలంగాణలో సోలార్ విద్యుత్ ప్లాంట ఏర్పాటుపై కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. స్వయం సహాయక సంఘాల ద్వారా ఈ సోలార్ విద్యుత్ ప్లాంట్‌ల ఏర్పాటు ప్రగతిపై బుధవారం ఉదయం ప్రజభవన్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ జరగగా.. దీనికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు.
స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి అందులో మహిళలను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకోసం ప్రభుత్వం తరఫున వారికి రుణ సదుపాయం సైతం కల్పించనున్నారు. దీని ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి.ఈ క్రమంలోనే ప్రభుత్వ స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం.