ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది. వైరస్ పరీక్షలు ప్రభుత్వం ఎక్కువగా నిర్వహించడంతో ఎక్కడికక్కడ కేసులు బయటపడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో గుంటూరు జిల్లా రాజకీయాలు కరోనా కంటే చాలా హాట్ హాట్ గా సాగుతున్నాయి. సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు విదేశాల నుండి దిగింది విడుదల రజిని. సీనియర్ నాయకుడు మర్రి రాజశేఖర్ కుమార్తెగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రజిని మొదట తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించింది.
ఇటీవల నియోజకవర్గంలో రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం లను ఆకట్టుకునే విధంగా విడుదల రజనీ చేసిన ప్రయత్నాలకు మైనార్టీ ప్రజలంతా మురిసిపోయారు. మరొక పక్క కరోనా వైరస్ కారణంగా నియోజకవర్గంలో సమస్య ఉన్న ప్రతి చోటా వాలిపోతూ అంతా తానై వ్యవహరిస్తున్నారు. వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడం తో మాజీ మంత్రి పుల్లారావు రంగంలోకి దిగాలని ప్రయత్నాలు చేస్తున్న నియోజకవర్గంలో పెద్ద ఆధారాలు దొరకడం లేదట. అదే సమయంలో పుల్లారావు వాయిస్ ఎక్కడ వినిపించకుండా కూడా రజినీ మతిపోయే స్ట్రాటజీ లతో దూసుకుపోతున్నారు.