తన సినిమాలో హీరోయిన్ గురించి రౌడీ హీరో ఏమన్నాడో తెలుసా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ… ప్రస్తుతం టాలీవుడ్ లో యూత్ ఐకాన్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా మాట్లాడే విజయ్ దేవరకొండ… యూత్ ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్ అనే సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ నటిస్తోంది. కాగా ఇటీవలే సోషల్ మీడియా వేదికగా తన కోస్టార్ అనన్య పాండే పై పొగడ్తల వర్షం కురిపించాడు విజయ్ దేవరకొండ. అనన్య పాండే చాలా డౌన్ టు ఎర్త్ అంటూ చెప్పిన విజయ్ దేవరకొండ గొప్ప టాలెంటెడ్ అంటూ ప్రశంసించాడు. అనన్య పాండే ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ కావడం ఖాయం అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.