రౌడీ బేబీ 2.0.. వీడియో వైరల్.. ఫ్యాన్స్ ఫిదా..!

తమిళ స్టార్ హీరో ధనుష్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన మారి 2 సినిమా ఎంత మంచి విజయాన్ని అందుకుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ సినిమాలోని రౌడీ బేబీ సాంగ్ సరికొత్త రికార్డులు సృష్టించింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా రౌడీ బేబీ పాట రికార్డు సృష్టించింది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా ఈ పాట ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉంది.

అయితే ఇప్పుడు రౌడీ బేబీ కొత్త వర్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ రౌడీ బేబీ పాటలో హీరో హీరోయిన్లు ధనుష్ సాయి పల్లవి కాదు… నాని సాయి పల్లవి లు డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. అదేంటి అంటారా… సాయి పల్లవి నాని జంటగా నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా లోని ఒక పాట వీడియో ని తీసుకుని దానికి రౌడీ బేబీ సాంగ్ యాడ్ చేసే అచ్చం ఈ సాంగుకు సెట్ అయ్యే విధంగా.. వీడియో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.https://twitter.com/ikaipullai/status/1329250750543740929?s=20