విజయ్ దివస్.. అమరులైన జవాన్లకు సీఎం రేవంత్ ఘన నివాళ్లు

-

డిసెంబర్-16వ తేదీని కేంద్ర ప్రభుత్వం విజయ్ దివస్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విధి నిర్వహణలో అమరులైన జవాన్లకు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టారు. దీనిపై భారత త్రివిధ దళాల పరాక్రమం, అంకిత భావం మనందరికీ గర్వకారణమని రాసుకొచ్చారు.

1971 యుద్ధంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి విజయానికి కారకులైన వీర జవానుల సేవలను స్మరిస్తూ ‘విజయ్ దివస్’ సందర్భంగా అమర జవాన్లకు సీఎం రేవంత్ నివాళులు అర్పించారు. 53ఏళ్ల క్రితం తూర్పు పాకిస్థాన్‌లో మొదలైన స్వతంత్ర తిరుగుబాటు భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్దానికి దారి తీసింది. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. ఈ యుద్ధం అనంతరమే తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్‌)కు విముక్తి లభించింది. ఈ విజయానికి గుర్తుగా ఇండియాలో ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్‌ని నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news