అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాలో భాను శ్రీ మెహ్రా హీరోయిన్ గా నటించింది. భాను శ్రీ మెహ్రా ఈ సినిమాలో తన అమాయకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా అనంతరం భాను శ్రీకి సినిమాలలో పెద్దగా అవకాశాలు రాలేదు. ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే నటించింది. కాగా, భాను శ్రీ మెహ్రా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.
తన సోదరుడు నందు ఏడు రోజుల క్రితం అనారోగ్య సమస్యతో మరణించాడు. అతడిని తలుచుకొని భాను శ్రీ మెహ్రా చాలా ఎమోషనల్ అవుతున్నారు. “నువ్వు చనిపోయి ఏడు రోజులు పూర్తయింది. ఇదంతా పీడ కలలానే ఉందంటూ భాను శ్రీ మెహ్రా చెప్పారు. ఇదంతా నిజమని ఎలా నమ్మాలి. నువ్వే గుర్తుకు వస్తున్నావు. నువ్వు లేవని బాధను జీవితాంతం మోయాల్సిందే. నా మనసులో ఎప్పటికీ నీకు చోటు ఉంటుంది. ఐ మిస్ యు నందు” అంటూ భాను శ్రీ మెహ్రా ఇన్ స్టాలో పోస్ట్ షేర్ చేసుకుంది. ఈ పోస్ట్ చూసిన చాలా మంది భాను శ్రీ మెహ్రాకి ధైర్యం చెబుతున్నారు.