పోలవరం ప్రాజెక్ట్ మీద ఎంపీ విజయసాయిరెడ్డి కీలక కామెంట్స్ చేసింది. పోలవరం నిర్మాణం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందన్న ఆయన డిజైన్లలో ఎలాంటి మార్పులు ఉండవని అన్నారు. ఈ ప్రాజెక్ట్ పై ప్రతిపక్షాలు చేస్తున్నది దుష్ప్రచారమేనని ఆయన అన్నారు. ప్రభుత్వాలకు నిధుల కొరత ఎప్పుడూ ఉంటుందని, అలా నిధుల కొరత లేదు అంటే అది నాన్ పెర్ఫార్మింగ్ గవర్నమెంట్ కింద లెక్క అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం నిధులు ఖర్చవుతాయన్న ఆయన ప్రభుత్వాలు వాటిని తిరిగి సమకూర్చుకుంటూ ఉంటాయని అన్నారు.
ఇది అంతా నిరంతర ప్రక్రియ అన్నారు. ఇక విశాఖలో అమ్మోనియం నైట్రేట్ నిల్వల దిగుమతి కోసం మూడు ఓడలు ఎదురు చూస్తున్నాయని, అమ్మోనియం నిల్వలను విశాఖలో నిల్వ చేయకండా నేరుగా పరిశ్రమలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ నుంచి వచ్చిన ఆదేశాలు ఆధారంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అంతే కాక ఏపీలో వివిధ వర్గాలవారికి ఇస్తున్న పింఛన్ల పెంపు పై త్వరలోనే నిర్ణయం ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.