ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మరియయు టీడీపీ లకు చెందిన నాయకులకు మధ్య నిత్యం వాదోపవాదనలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతిపక్షము పనిచేస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీపై సంచలన వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో ఆ పార్టీ నాయకులు అంతా ఇష్టానుసారంగా దోచుకుతిన్నారు. ఇంకా ఆ ఆకలి తీరినట్లు లేదు అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నడిపిస్తున్న ఈ పార్టీకి ఒక సిద్ధాంతం అంటూ లేదు అన్నారు, ఒక మాట మీద కూడా నిలబడిన పాపాన పోలేదు అంటూ దుయ్యబట్టారు.
సిద్ధాంతం లేని పార్టీ టీడీపీ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
-