బాబు చేస్తున్న గలీజు పనులివే.. బాబు స్కెచ్ బయటపెట్టిన విజయసాయి రెడ్డి..!

-

vijayasai reddy controversial tweets on chandrababu
vijayasai reddy controversial tweets on chandrababu

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సామాజిక మాధ్యమాల్లో ట్విటర్ వేధికలో యాక్టివ్ గా ఉంటాడు. తమ పార్టీ చేపట్టే పథకాల గురించి నెటిజన్లకు చెబుతూనే ప్రతిపక్ష పార్టీ టీడీపీ పై నిప్పులు కక్కుతూ ఉంటాడు. ఇక మంగళవారంలోని హైదరబాద్ నగరంలోని పార్క్ హయత్ హోటల్ లో నిమ్మగడ్డ రమేష్, కామినేని శ్రీనివాస్, సుజనా చోదరీలు సీక్రెట్ మీటింగ్ పెట్టారని ఆ మీటింగ్ కు చంద్రబాబే కారణం అని విజయ సాయిరెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఈనేపద్యంలో నిన్నటి నుండి ఆయన బాబు పై ఆరోపణల బాణాలు వేస్తూనే ఉన్నారు.

ఇక ఇవాళ ఉదయం ఆయన తన ట్విట్టర్లో మరోసారి బాబు పై ఫైర్ అయ్యారు.. ఆయన మాట్లాడుతూ ‘’బాబు హైదరాబాద్ లో చేస్తున్న గలీజు పనులివే. గోతులు తవ్వడం, చీకటి వ్యవహారాలు, మ్యానిప్యులేషన్లు, వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో మునిగి తేలుతుంటాడు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని విజయవంతంగా సమాధి చేసి, దళారి స్థాయికి పతనమయ్యాడు. అధికారం దరిదాపుల్లోకి ఎప్పటికీ రాలేడు.

ఇక మరో ట్వీట్ లో.. ఆయన మాట్లాడుతూ.. ఏడాదిలోనే 90 శాతం హామీలు నెరవేర్చి, ఇంకా చేయాల్సిన పనుల గురించి జగన్ గారు తపన పడుతుంటే, బాబు గ్యాంగ్ హైదరాబాద్ లో తిష్ఠవేసి కుట్రలకు తెగబడ్డారు. రాష్ట్ర శ్రేయస్సు అవసరం లేదు. ప్రజలు సంతోషంగా ఉండొద్దు. సంక్షేమ పాలనను ఎలా అడ్డుకోవాలా అని స్కెచ్చులు వేస్తున్నారు. అంటూ చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version