రైతులకు హామీ ఉంది… బ్రోకర్లకు భరోసా లేదు!

-

ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న అనంతరం మరింతగా రెచ్చిపోతున్నారు విజయసాయిరెడ్డి! ట్విట్టర్ లో తనదైన పాలిటిక్స్ నడిపిస్తూ.. ప్రత్యర్ధులను ఇరుకునపెడుతూ.. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. తనదైన మార్కు ట్వీట్లు పెడుతుంటారు సాయిరెడ్డి! ఈ క్రమంలో తాజాగా “అమరావతి – రైతులు – రియల్ ఎస్టేట్ బ్రోకర్లు” అనే అంశంపై ట్వీట్ చేశారు సాయిరెడ్డి!

సీఆర్డీయే స్థానే ఏపీ సర్కార్ ఏర్పాటుచేసిన ఏఎమ్‌ఆర్డీఏ తాజా సమీక్షలో జగన్ మనసు అర్ధం అయ్యిందని.. ఆ సమీక్ష గురించి పూర్తిగా ఆలోచించి అర్ధం చేసుకున్నవారికి అసలు విషయం అర్ధమవుతుందని చెప్పే ప్రయత్నం చేశారు సాయిరెడ్డి. అవును… “వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధికొచ్చిన నష్టమేమీ లేదు. మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యమంత్రి గారి ఏఎమ్‌ఆర్డీఏ సమీక్ష చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదు. అయితే రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మాత్రం ఎవరూ హామీలివ్వలేరు” అని ట్వీట్ చేశారు సాయిరెడ్డి!

నిజం చెప్పాలంటే… తాజాగా ఏఎమ్‌ఆర్డీఏ సమీక్షను నిశితంగా పరిశీలిస్తే… పూర్తిరాజధాని లేనంత మాత్రాన్న రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు నష్టం జరగకుండా ఏపీ సర్కార్ జాగ్రత్తలు తీసుకుంటుందనే విషయం అర్ధమవుతుందని అంటున్నారు విశ్లేషకులు. కాకపోతే… పదికి పాతికకు భూములుకొని కోట్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారలు చేసిన వారు మాత్రం బలైపోయే అవకాశాలున్నాయని అంటున్నారు! సాయిరెడ్డి ట్వీట్ కూడా ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పిందని అంటున్నారు విశ్లేషకులు!

Read more RELATED
Recommended to you

Exit mobile version