“పార్టీ లేదు-బొక్కాలేదు” అంటూ చంద్రబాబు అన్న వీడియోను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి షేర్ చేశారు. మొన్న అచ్చన్న…నిన్న స్వయంగా చంద్రబాబే “పార్టీ లేదు-బొక్కాలేదు” అనేశాడే! అంటూ ఆ వీడియోను షేర్ చేశారు విజయసాయిరెడ్డి.
రోజురోజుకూ పార్టీ నిర్వీర్యం అయిపోతోందని మా చంద్రం అన్నయ్యే తేల్చేశాడు. ఎల్లో మీడియా ఎన్ని బాకాలు ఊదినా…పెగ్గురాజు ఢిల్లీలో ఎంత పేలినా ఇక లాభం లేదు. టీడీపీకి 2024 చివరి ఎన్నికలు. తమ్ముళ్లూ సర్దుకోండిక! అంటూ చురకలు అంటించారు.
నీకు పార్లమెంట్లో పనుందా? “రొచ్చుబండ” పెట్టలేకపోతున్నావా? పార్లమెంట్లో నీకు ఓనామాలైనా వచ్చా విగ్గురాజు? ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ పరిధిలోనే అప్పులు చేస్తుందిరా గబ్బు! ఆ విగ్గు తీసి ఆలోచించు. కనీసం బుర్రకేమైనా ఎక్కుతుందేమో!అంటూ మరో ట్వీట్ లో రఘురామను టార్గెట్ చేశారు.
మొన్న అచ్చన్న…నిన్న స్వయంగా చంద్రబాబే "పార్టీ లేదు-బొక్కాలేదు" అనేశాడే! రోజురోజుకూ పార్టీ నిర్వీర్యం అయిపోతోందని మా చంద్రం అన్నయ్యే తేల్చేశాడు. ఎల్లో మీడియా ఎన్ని బాకాలు ఊదినా…పెగ్గురాజు ఢిల్లీలో ఎంత పేలినా ఇక లాభం లేదు. టీడీపీకి 2024 చివరి ఎన్నికలు. తమ్ముళ్లూ సర్దుకోండిక! pic.twitter.com/IDGpPBfC8s
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 14, 2022