కాంగ్రెస్‌లో కల్లోలం..వ్యూహకర్తకే చెక్..రేవంత్ యాక్షన్ ప్లాన్.!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి అగమ్యగోచరంగా మారిపోయింది..రోజురోజుకూ ఆ పార్టీలో ఏం జరుగుతుందో అర్ధం కాకుండా ఉంది. ఓ వైపు రాజకీయంగా బీఆర్ఎస్-బీజేపీల మధ్య వార్ జరుగుతుంటే కాంగ్రెస్ లో మాత్రం వారిలో వారే తిట్టుకుంటున్నారు. ప్రత్యర్ధులపై ఫైట్ చేయాల్సిన వారు. సొంత పార్టీ నేతలపైనే ఫైట్ చేస్తున్నారు. సరే ఏదొకటి అయింది..ఇటీవల పార్టీకి ఊపు వచ్చేలా కొత్తగా పదవుల పంపకాలు చేశారు..ఇంకా నేతలు దూకుడుగా పనిచేస్తారు అనుకుంటే…కొందరు నేతలు తమకు చిన్న పదవులు ఇచ్చారని, కొందరికి పదవులు దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేయడం, రాజీనామాలు చేయడం చూస్తున్నారు.

 

ఇలా కాంగ్రెస్ లో రచ్చ జరుగుతుండగానే తాజాగా కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కానుగోలు టార్గెట్ గా సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు జరిగాయి. సునీల్ ఆఫీసులో  పోలీసులు కీలకమైన కంప్యూటర్‌, ల్యాప్‌టా్‌పలను సీజ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టులపై ఫిర్యాదు ఆధారంగా సోదాలు నిర్వహించినట్లు పోలీసులు చెబుతున్నారు. సునీల్ ఆపన్నహస్తం పేరిట రెండు ఫేస్ బుక్ పేజ్ లను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక సోదాలు జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌ అలీ, మల్లు రవి…సునీల్ ఆఫీసుకు వెళ్ళి నోటీసులు లేకుండా సోదాలు ఎలా చేస్తారని నిలదీశారు. సెర్చ్‌ వారెంటు లేకుండా, 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసు ఇవ్వకుండా సుప్రీంకోర్టు తీర్పును పోలీసులు ఉల్లంఘించారని.. దీనికి మంత్రి కేటీఆర్‌, సీపీ ఆనంద్‌ బాధ్యత వహించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఠాగూర్‌ ట్విటర్‌లో డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌పై పోలీసుల దాడికి నిరసనగా బుధవారం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేయడానికి రేవంత్ సిద్ధమయ్యారు.

అసలు ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని..ఇప్పుడు ఏకంగా వ్యూహకర్తకే చెక్ పెట్టేలా రాజకీయం నడుస్తుండటంతో మరింత ఇబ్బందిగా మారింది. మరి ఈ పరిస్తితుల నుంచి కాంగ్రెస్ పార్టీని రేవంత్ బయట ఎలా పడేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version