పాకిస్తాన్‌ లో కంటే ఇండియాలోనే ముస్లింలు సుఖంగా జీవిస్తున్నారా? – విజయసాయిరెడ్డి

-

పాకిస్తాన్‌ లో కంటే ఇండియాలోనే ముస్లింలు సుఖంగా జీవిస్తున్నారా? అంటూ విజయసాయిరెడ్డి పోస్ట్‌ పెట్టారు. ప్రపంచంలో అతిపెద్ద లౌకిక, ప్రజాతంత్ర దేశమైన ఇండియాలో ముస్లింలపై ఇటీవల హింసాత్మక దాడులు జరుగుతున్నాయనే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ ను సోమవారం న్యూయార్క్‌ లో జరిగిన ఓ సదస్సులో ప్రశ్నించగా, ఆమె వివరాలతో కూడిన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ పటుత్వం, ప్రగతిపై పీటర్సన్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఇకనామిక్స్‌లో జరిగిన చర్చ సందర్భంగా ఈ సంస్థ అధ్యక్షుడు ఆడమ్‌ ఎస్‌ పోసెన్‌ భారత మంత్రిని ప్రశ్నించారన్నారు.


ఇండియాలో ముస్లింలకు అన్యాయం జరగడం లేదనీ, వారు పాకిస్తాన్‌ తో పోల్చితే సుఖసంతోషాలతో ఇక్కడ జీవిస్తున్నారని నిర్మల చెప్పారు. ‘‘ప్రపంచంలో రెండో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం భారత్‌. వారి జనాభా ఇక్కడ పెరుగుతుండడాన్ని బట్టి చూస్తే వారు హాయిగా జీవిస్తున్నట్టు భావించాలి. ఇండియాలో ముస్లింలకు భద్రత లేదనేవారి ఆరోపణకు నాదొక్కటే జవాబు. 1947 తర్వాత దేశంలో ఇస్లాం అనుసరించేవారి జనసంఖ్య పెరుగుతోంది కదా. అదే పాక్‌ లో చూడండి. అక్కడ మతపరమైన మైనారిటీల జనాభా శాతం తగ్గిపోతోంది. వారికి ఇండియాలో మాదిరిగా స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లేవు,’’ అని ఆర్థికమంత్రి వివరించారు. ‘పాకిస్తాన్‌లో మైనారిటీల సంగతి సరేనని తెలిపారు.

ముస్లింలలోని ముహాజిర్లు, షియాలు వంటి అల్పసంఖ్యాక వర్గాల పరిస్థితి దారుణంగా ఉంది. ఇక ఇండియా విషయానికి వస్తే–ముస్లింలపై హింస జరుగుతోందనే వాదన అబద్ధం. 2014 నుంచి ఇప్పటి వరకూ దేశంలో ముస్లింల జనాభా పెరుగుతూ ఉండడమే దీనికి నిదర్శనం,’ అని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. రెండు దేశాల్లో ఆచరించే ప్రజాస్వామ్యం నాణ్యత, మైనారిటీలకు రక్షణ విషయంలో పాకిస్తాన్‌తో పోల్చడానికి వీలులేని స్థాయిలో ఇండియా ప్రగతి సాధించిందనే వాస్తవాన్ని అంతర్జాతీయ నిపుణులు అంగీకరిస్తారు. ఇక ఆర్థిక సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగడంలో భారత ప్రజల, ఆర్థిక వ్యవస్థకున్న శక్తియుక్తులు, సామర్ధ్యం అంతర్జాతీయ ప్రమాణాలను మించి ఉన్నాయి. క్రమం తప్పకుండా ఎన్నికలు జరుపుతూ, నిలకడగా ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్న ఇండియా తన మైనారిటీలకు కాపాడుకుంటూనే అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నదనేది నిర్వివాదాంశం అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version