బ్రేకింగ్: ఈ నెల 7 న బిజెపిలోకి రాములమ్మ

-

బిజెపిలోకి కీలక పార్టీల నేతలు అందరూ కూడా ఇప్పుడు వెళ్తున్నారు. దాదాపుగా కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి ఎక్కువగా చేరికలు ఉన్నాయి. కీలక నేతలకు బిజెపి గాలం వేస్తుంది. కాంగ్రెస్ నుంచి విజయశాంతి బిజెపిలోకి వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఈ నెల 7 న ఆమె పార్టీలోకి వెళ్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందే ఆమె పార్టీ మారే అవకాశం ఉంది అని భావించినా సరే ఆమె మాత్రం మారలేదు.

ఢిల్లీ వెళ్లి ఆమె తిరిగి వచ్చేశారు. గత నెల చివరి వారంలో ఆమె చేరిక విషయంలో చాలా వార్తలు వచ్చాయి. బిజెపి అగ్ర నేతలతో ఆమె చర్చించారు. ఢిల్లీ వెళ్లి పార్టీ మారనున్నారు. ఆమెతో పాటుగా మరో ఇద్దరు నేతలు కూడా ఢిల్లీ వెళ్లి పార్టీ మారడానికి రెడీ అయ్యారని సమాచారం. జెపి నడ్డా సమక్షంలో ఆమె పార్టీ మారుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version