కవితపై బండి వ్యాఖ్యలు..విజయశాంతి స్ట్రాంగ్‌ కౌంటర్‌

-

కవితపై బండి సంజయ్‌ వ్యాఖ్యలు చేసిన విషయంపై..విజయశాంతి స్పందించారు. ధర్మపురి అర్వింద్ గారి ప్రకటనపై నన్ను మీడియా వారు అడుగుతున్న ప్రశ్నకు సమాధానంగా…”బీజేపీ నేత ఎవరైనా… పార్టీ కార్యకర్త, నేత లేదా అధ్యక్షుల కామెంట్స్ పై స్పందించినా… మాట్లాడినా… అది పార్టీ సమావేశాల్లో జరిగితే, ఎప్పుడూ కూడా అది అంతర్గత ప్రజాస్వామ్య విధానంగా పార్టీ పరిగణిస్తాదని విజయశాంతి తెలిపారు.

ఆ కామెంట్స్‌ని సందర్భ, సమయ, సమస్య పరిస్థితుల ప్రామాణికతతో విశ్లేషించడం… అవసరమైన నిర్ణయం చెప్పడం కూడా సహజంగా పార్టీ విధానం. పై కామెంట్ మీద నన్ను మీరు అడిగిన ప్రశ్నకైనా… నేను పార్టీ అంతర్గత సమావేశంలో మాత్రమే నా అభిప్రాయం చెప్పగలను.” అని వివరించారు రాములమ్మ. మా పార్టీ ఎంపీ అర్వింద్ గారు మాట్లాడిన సందర్భం మొత్తం నేను చూడలేదు కానీ, అందులోని ఏదో ఒక అంశాన్ని ప్రొజెక్ట్ చేస్తున్న బీఆరెస్ అనుకూల మీడియాకు మాత్రం ఒక్కటే ఈ సందర్భంగా చెప్పగలను. సంజయ్ గారు తన మాటలు వెనక్కి తీసుకోవాల్సి వస్తే… కేసీఆర్ గారు, వారి కుటుంబం, చాలామంది బీఆరెస్ నాయకులు వారి గత, ఇప్పటి మాటలను అనేకసార్లు వెనక్కి తీసుకుని, వందల సార్లు ముక్కు నేలకు రాయాల్సి వస్తుందని కూడా ఆ మీడియా గుర్తించాలన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version