ఏం కేసీఆర్…. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? : విజయశాంతి

-

ఏం కేసీఆర్…. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? అని నిలదీశారు విజయశాంతి. కేసీఆర్ ప్ర‌భుత్వం స‌ర్కారీ బ‌డుల‌ను నిర్ల‌క్ష్యం చేస్తూ… కార్పోరేట్ విద్యాసంస్థ‌ల‌కు పెద్ద పీట వేస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వ‌ాకం వ‌ల్ల సర్కారీ స్కూళ్లు నిధుల్లేక కొట్టుమిట్టాడుతున్నాయని ఆగ్రహించారు.

విద్యా సంవత్సరం ప్రారంభమై నెలన్నర దాటినా ప్రభుత్వం ఒక్క బడికీ పైసా ఇవ్వలేదు. దీంతో హెడ్మాస్టర్లు అప్పులు చేసి స్కూళ్లు నడుపుతున్నరు. మరో 20 రోజుల్లో పంద్రాగస్టు రానున్నది. కనీసం అప్పటి వరకైనా స్కూల్ గ్రాంట్స్ ఇస్తరో… లేదో… అని హెడ్మాస్టర్లు, టీచర్లు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. బడుల నిర్వహణ కోసం విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రభుత్వం ఏటా గ్రాంట్స్ ఇస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 24,852 స్కూళ్లకు రూ.12,500 నుంచి లక్ష వరకు రెండు విడతల్లో నిధులు ఇవ్వాల్సి ఉంది. గత నెల 13నే స్కూళ్లు రీఓపెన్ అయినప్పటికీ… ఇంతవరకూ నిధులు రిలీజ్ చేయలేదు. ఇది చాలక గ‌తంలో ఇచ్చిన పైస‌ల‌ను కూడా ప్రభుత్వం వెన‌క్కి తీసుకుందని వెల్లడించారు.

ఎన్నిక‌ల ముందు కేజీ టు పీజీ అంటూ ఉద‌ర‌గొట్టిన కేసీఆర్… ఇప్ప‌టి వ‌రకు దీనిని అమ‌లు చేసిన పాపాన పోలేదు. క‌నీసం ఉన్న బ‌డుల‌ను నడిపించడానికి అవసరమైన నిధుల‌ను కూడా ఇవ్వ‌డం లేదు. ఏం కేసీఆర్…. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? ప్ర‌భుత్వ విద్యను గాలికొదిలేసి కార్పోరేట్ విద్యను ప్రోత్స‌హిస్తున్న కేసీఆర్ స‌ర్కార్‌కు తెలంగాణ ప్ర‌జానీక‌మే త‌గిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు విజ‌య‌శాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version