కేసీఆర్‌కు.. విద్యార్థులు గట్టి గుణపాఠం చెబుతారు : విజయశాంతి

-

మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విజయశాంతి విమర్శలు గుప్పించారు. విద్యార్థుల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు విజయశాంతి. విద్యావ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్న కేసీఆర్‌కు విద్యార్థులు గట్టి గుణపాఠం చెప్ప‌డం ఖాయమని విజయశాంతి హెచ్చరించారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా.. ”విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం… నారాయణఖేడ్లో ఫుడ్ పాయిజన్ జరిగి దాదాపు 20 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురవడంతో వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.

బాధ్యులందరిపైనా చర్యలు తీసుకోవాలని బీజేపీ త‌రఫున డిమాండ్ చేస్తున్నం. ఫుడ్​ పాయిజనింగ్​తో పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉండడం చూస్తుంటే… కేసీఆర్ స‌ర్కార్‌కు విద్యా వ్య‌వ‌స్థ ప‌ట్ల ఎంత చిత్త‌శుద్ధి ఉందో…బాగా అర్థమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. కేసీఆర్ స‌ర్కార్ ఇప్ప‌టికైనా విద్యా వ్య‌వ‌స్థ‌పై నిర్ల‌క్ష్యం వీడి త‌గిన సౌక‌ర్యాలు క‌ల్పించాలి. విద్యావ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్న కేసీఆర్‌కు విద్యార్థి లోకం గట్టి గుణపాఠం చెప్ప‌డం ఖాయం.” అని విజయశాంతి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version