బీఆర్‌ఎస్‌ దొంగల పార్టీ : విజయశాంతి

-

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేపట్టారు. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇల్లీగల్ దందా చేసేది కేసీఆర్ ప్రభుత్వమే అంటూ ధ్వజమెత్తారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం కేసీఆర్ ప్రభుత్వంలో కొన్నేళ్లుగా జరుగుతున్న వ్యాపారం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేరుగా చైర్మన్ రూమ్కి వెళ్లి పేపర్ లీక్ చేయొచ్చా? అంటూ విజయశాంతి ప్రభుత్వాన్ని అడిగారు విజయశాంతి.

 

మార్చి 25న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో “మా నౌకరీలు మాగ్గావాలి” పేరుతో బీజేపీ పార్టీ నిరుద్యోగ మహా ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో విజయశాంతి మాట్లాడుతూ.. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అని కొత్త నిర్వచనం చెప్పారు. TSPSC పేపర్ లీకేజీలో కేసీఆర్, కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు. కేసీఆర్ చేసేవన్నీ ఫ్రాడ్ పనులు, దాంట్లో మళ్లీ భేరాలు ఆడుతాడని అన్నారు విజయశాంతి. ఆయనకు కావాల్సింది లాభాలు మాత్రమేనని అన్నారు విజయశాంతి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పేపర్ లీకేజీ కావడంతో నష్టపోయిన నిరుద్యోగ అభ్యర్థులకు ఫీజులు మాఫీ చేస్తామని, ఉచితంగా భోజనాలు పెడతాం, పుస్తకాలు పంపిణీ చేస్తామని మాయ మాటలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు విజయశాంతి. 3 లక్షల మంది జీవితాలతో ఆడుకున్నారని.. కేసీఆర్ కు సీఎం పదవిలో ఉండే అర్హత లేదని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version