మైక్ టైస‌న్ తో రౌడీ హీరో…అమెరికాలో లైగ‌ర్ షెడ్యూల్ షురూ..!

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం న‌టిస్తున్న సినిమా లైగ‌ర్. ఈ సినిమాకు పూరీజ‌గ‌న్నాత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ కిక్ బాక్స‌ర్ గా క‌నిపించ‌బోతున్నాడు. ఇక సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో తెర‌కెక్కిస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మైక్ టైస‌న్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నట్టు చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

vijaydewarakonda liger movie update
vijaydewarakonda liger movie update

అంతే కాకుండా తాజాగా ఈ మైక్ టైస‌న్ మ‌రియు విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ధ్య స‌న్నివేశాల‌ను అమెరికాలో చిత్రిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ను చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సంధ‌ర్భంగా విడుద‌ల చేసిన ఫోటోలో మైక్ టైస‌న్ మ‌రియు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌వ్వులు పూయిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌ల చేసిన పోస్ట‌ర్లు సినిమాపై అంచనాల‌ను పెంచేశాయి. ఈ సినిమాతో విజ‌య్ పాన్ ఇండియా స్టార్ గా ప‌రిచ‌యం కానున్నారు.