4‌వ రోజు వినాయ‌క‌ పూజ స‌తంతాన ప్రాప్తి.. లోభాసురుని క‌థ‌

-

విజ్ఞ‌నాయ‌కుడు వినాయ‌కుడిని న‌వ‌రాత్రుల్లో భాగంగా నాల్గ‌వ రోజు ఆరాధిస్తే మంచి సంతానం క‌లుగుతుంద‌ని పురాణాల‌లో చెప్ప‌బ‌డింది. అయితే గ‌ణేషుని మ‌హ‌త్యాన్ని తెలిపే లోభాసురుడి క‌థ తెలుసుకుందాం.

lord shiva worshipping vinayaka

రావణుడు తన సోదరుడు, విశ్రవో బ్రహ్మ కుమారుడైన కుబేరుని లంక నుంచి వెళ్లగొట్టాడు. ఎక్కడికి వెళ్లాలో తెలీని కుబేరుడు, తండ్రి సలహా ప్రకారం కైలాసానికి వెళ్లాడు. శివుడికి అతడు ప్రియమిత్రుడు కూడా. కైలాసంలో శివునితో ఉన్న పార్వతీదేవి సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యచకితుడ య్యాడు. ఆ సౌందర్యరాశి తనకు లభించిన బాగుండుననిపించింది. మనస్సు చెదిరింది. చూపులో చంచలత ఏర్పడింది. కుబేరుని మనో వికారాన్ని, చెడ్డ దృష్టిని గమనించిన ఆ జగన్మాత అతని వైపు కోపంతో చూసింది. ఆ క్రోధాగ్నిలో కుబేరుని కన్ను ఒకటి మాడిపోయింది. రెండవ కన్ను కూడా పింగళ అంటే ఎరుపు వర్గానికి మారింది. కొద్ది సమయానికి అది కూడా మాడిపోయేదే, కానీ సర్వజ్ఞుడైన శివుడు మిత్రుడైన కుబేరుడి మనసులోని భావాన్ని గ్రహించాడు.

పార్వతితో… దేవీ! అతడు నాకు ఆత్మీయుడు, మంచివాడు అతని బుద్ధి చాపల్యాన్ని మన్నించి అనుగ్రహించమని చెప్పాడు. భర్త మాట
విన్న పార్వతి కుబేరుడి మీద కోపాన్ని వీడింది. కానీ అప్పటికే ఒక కన్ను మాడిపోయినందున ఏకాక్షుడని, రెండవ కన్ను పింగళవర్ణంలోకి మారటం వల్ల పింగాక్షుడు, పింగళాక్షుడు అని కుబేరునకు పేర్లు వచ్చాయి. ఆ సందర్భంలోనే మాడిపోయిన కంటి బూడిదనుంచి లోభం అనే రాక్షసుడు పుట్టాడు.

రాక్షస గురువైన శుక్రాచార్యుడు లోభాసురునకు శివ పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు. నిష్టతో తపస్సు చేసిన లోభాసురుడు శివుని అనుగ్రహం పొంది శక్తిపూర్ణుడయ్యాడు. లాలస అనే కన్యను వివాహం చేసుకున్నాడు. తన పరాక్రమంచే ముల్లోకాలను జయించాడు. ధర్మం పతనమైంది. దీంతో గ‌గ్గోలెత్తుతున్న దేవతలు, మునులకు గజానన వినాయకుడిని ఆశ్రయించండంటూ రైధ్యుడనే ముని సలహా ఇచ్చాడు. అయితే, లోభాసురుడు శివ భక్తుడైనందు వల్ల తన అభిప్రాయము తెలియచేయుటకు శివునే అతని వద్దకు పంపాడు గజాననుడు. పరమేశ్వరుడు గజాననుడి మహిమను లోభునికి వివరించాడు.

దీంతో లోభ రాక్షసుడు గణపతి శరణువేడి పాతాళమునకు వెళ్లిపోయాడు. ధర్మ విరుద్దము కాని లోభము ప్రమాద కారి కాదు, అందుకే లోభాసురుని సంహరింపలేదు. కాబట్టి గజానన సేవించి మనలోని లోభగుణాన్ని నిగ్రహించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version