కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో సోమవారం (24-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. దేశంలో కొత్తగా 61,408 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 31,06,349కి చేరుకుంది. 23,38,036 మంది కోలుకున్నారు. 7,10,771 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 57,542 మంది చనిపోయారు.
2. అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ప్లాస్మా చికిత్స చేసేందుకు హాస్పిటళ్లకు అనుమతిచ్చింది. కరోనా రోగులకు ఈ చికిత్స అందిస్తారు. ఇప్పటికే ఈ థెరపీని అనేక దేశాల్లో అందిస్తున్నారు.
3. తెలంగాణలో కొత్తగా 1,842 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,06,091కి చేరుకుంది. 82,411 మంది కోలుకున్నారు. 22,919 మంది చికిత్స పొందుతున్నారు. 761 మంది చనిపోయారు.
4. ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ను రష్యా స్పుత్‌నిక్-వి పేరిట విడుదల చేయగా.. త్వరలో మరో వ్యాక్సిన్‌ను ఆ దేశం విడుదల చేయనుంది. అక్కడి వెక్టర్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయో టెక్నాలజీ వారు రూపొందించిన ఎపివాక్ వ్యాక్సిన్‌ను ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నారు.
5. ఏపీలో కొత్తగా 8,601 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,61,712కు చేరుకుంది. 2,68,828 మంది కోలుకున్నారు. 89,516 మంది చికిత్స పొందుతున్నారు. 3,368 మంది చనిపోయారు.
6. కరోనా నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులను నిర్వహించేందుకు అనుమతులు జారీ చేసింది. డిజిటల్, టీవీ, టీశాట్ తదితర మాధ్యమాల్లో ఆన్‌లైన్ క్లాసులను నిర్వహించవచ్చు.
7. తమిళనాడులో కొత్తగా 5,967 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,85,352కు చేరుకుంది. 3,25,456 మంది కోలుకున్నారు. 53,282 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 6,614 మంది చనిపోయారు.
8. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 75.27 శాతానికి చేరుకుంది. ఆదివారం ఒక్క రోజే 6,07,917 శాంపిల్స్ ను పరీక్షించారు. మొత్తం 3,59,02,137 శాంపిల్స్ ను ఇప్పటి వరకు పరీక్షించారు.
9. రోజులో 24 గంటలూ వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా హాస్పిటల్‌ను మంత్రులు ఈటల, ఎర్రబెల్లి సందర్శించారు.
10. బ్రెజిల్‌లో కరోనా విలయ తాండవం చేస్తోంది. అక్కడ మొత్తం కేసుల సంఖ్య 36,05,782కు చేరుకుంది. మొత్తం 1,14,744 మంది చనిపోయారు. ఒక్క రోజులోనే అక్కడ కొత్తగా 23,431 కరోనా కేసులు నమోదయ్యాయి.