మనసున్న మారాజు, గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ : వినోద్‌ కుమార్‌

-

మంగళవారం శ్రీనగర్ కాలనీలోని సత్య సాయి నిగమాగమంలో జరిగిన ఐ.ఈ.ఆర్.పీ. ల రాష్ట్ర సదస్సులో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ ఆయన ప్రసంగిస్తూ, మనసున్న మారాజు, ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారం కోసం నిరంతరం తపించే గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ నాటి, నేటి పరిస్థితులను సోదాహరణంగా వివరించి చెప్పారు వినోద్ కుమార్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు దగా పడ్డ తెలంగాణ, స్వరాష్ట్రం తెలంగాణ సిద్ధించిన తర్వాత సాధించిన ప్రగతిని వినోద్ కుమార్ పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు.

దివ్యాంగ పిల్లలకు ప్రత్యేక పద్దతుల్లో విద్యాబోధన చేయడం చేయడం గొప్ప విషయమని, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ పాత్ర అమోఘం అని వినోద్ కుమార్ వెల్లడించారు. వినోద్ కుమార్ మాట్లాడుతూ బుద్ధి మాంద్యం, మానసికంగానూ, అంగ వైకల్యంగానూ బాధపడుతున్న పిల్లలకు, కళ్ళు కనిపించని, చెవులు పినిపించని పిల్లలకు ప్రత్యేక పద్దతుల్లో విద్యాబోధన చేస్తున్న ఐ.ఈ.ఆర్.పీ. ల సేవలు సమాజంలో ప్రతి ఒక్కరికీ కదిలిస్తాయని వెల్లడించారు ఆయన.ఈ విషయంలో ఎంతో ఓపికతో విద్యా బోధన చేస్తున్న ఐ.ఈ.ఆర్.పీ.ల ఉద్యోగ సర్వీస్ ను క్రమబద్ధీకరణ చేసే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు వినోద్ కుమార్ .

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version