చంద్రబాబు అరెస్ట్ తో పడిపోయిన హెరిటేజ్ షేర్స్… !

-

చంద్రబాబును అరెస్ట్ చేసిన అనంతరం ఏపీలోని టీడీపీ పార్టీకి బీటలు వాలాయి అని చెప్పాలి. చంద్రబాబు లాంటి సీనియర్ నేత అవినీతికి సంబంధించిన కేసులో జైల్లోకి వెళ్లి కూర్చుంటే పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు టీడీపీ క్యాడర్ ను వణికిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తో భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ లు ఒక్కసారిగా ఢీలా పడిపోయారు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం చంద్రబాబు అరెస్ట్ కావడం వలన మరో నష్టం కూడా కలిగింది. గతంలో చంద్రబాబు ప్రారంభించిన హెరిటేజ్ షేర్లు ఒక్కసారిగా పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న ఒక్కొక్క హెరిటేజ్ షేర్ ధర రూ. 257 .90 ల వద్ద ట్రేడింగ్ స్టార్ట్ కాగా … రూ. 253 వద్ద ఉండగా ట్రేడింగ్ ముగిసినట్లు తెలుస్తోంది. ఇక ఇవాళ రూ. 253 వద్ద స్టార్ట్ కాగా సాయంత్రానికి రూ. 221 .45 వద్ద ముగిశాయి.

ఈ విధంగా చూస్తే కేవలం రెండు రోజులలో రూ. 36 . 45 పైసలు తగ్గిపోయింది ఒక షేర్ ధర. దీనితో హెరిటేజ్ లో పెట్టుబడులు పెట్టిన ప్రతి ఒక్కరూ కంగారు పడుతున్నారు. మరి చంద్రబాబు జైలు నుండి వస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version