విప్ ఆది శ్రీనివాస్ ఇలాకాలో జోరుగా అక్రమ ఇసుక దందా..?

-

కాంగ్రెస్ ప్రభుత్వంలో జోరుగా అక్రమ దందాలు సాగుతున్నట్లు పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇలాకాలో జోరుగా అక్రమ ఇసుక దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో వందలాది ట్రాక్టర్లతో అక్రమ ఇసుక దందా నడుస్తోందని సమాచారం. తమ గ్రామానికి ఒక్క రూపాయి ఫండ్ ఇవ్వకుండా, ఇసుకను దోపిడీ చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ విప్ కనుసన్నల్లోనే నడుస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అందుకే ఆయన పట్టించుకోవడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news