వైరల్‌ వీడియో : సోషల్ మీడియాను ఊపేస్తున్న బుల్లి అయ్యప్ప… పంబా వాసుడే దిగి వచ్చేలా నృత్యం…!

-

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప మాలలు ధరిస్తున్న సంగతి తెలిసిందే. అయ్యప్ప దీక్షకు గాను భక్తులు సిద్దమయ్యారు. ఇక ఈ మాలలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తమకు ఉన్న చెడు అలవాట్లు వదులుకోవాలని యువత ఎక్కువగా మాలధారణ చేస్తుంది. చిన్న పిల్లలు కూడా దీని వైపు మొగ్గు చూపుతున్నారు. నిష్టగా ఉండటానికి సిద్దపడుతున్నారు వాళ్ళు. దీనితో పెద్దలు కంటే యూత్ లోనే దీనిపై క్రేజ్ ఎక్కువగా ఉంది.

గతంలో భక్తితో ఎక్కువగా మాలధారణ చేస్తే ఇప్పుడు మాత్రం తమకు అంతా మంచే జరగాలని,ఆ పంబా వాసుడి దయ తమ మీద ఉండాలని, తమ వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు తగ్గాలని, తమను వేధిస్తున్న చెడు అలవాట్లను వదులుకోవాలని, మద్యం, ధూమపానం వంటి వాటి నుంచి విముక్తి పొందాలని యువత ఎక్కువగా మాలదారణకు ఆసక్తి చూపిస్తుంది. అదే విధంగా పిల్లల విషయంలో తల్లి తండ్రులు ప్రత్యేక దృష్టి సారించి వారికి మంచి భవిష్యత్తుని ఆ నీలకంటుడు ఇవ్వాలని కోరుకుంటూ మాలధారణ ధరింపజేస్తున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే హవా నడుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయ్యప్ప మాలధారణ చేసిన ఒక బాలుడు అయ్యప్ప పాటకు చేసిన నృత్యం సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తుంది. పంబా వాసుడు అంటూ మొదలయ్యే ఆ పాటలో బాలుడు హుషారుగా నృత్యం చేస్తూ తన చుట్టూ ఉన్న వారిలో కూడా ఒక హుషారు తీసుకొస్తాడు. ప్రస్తుతం వాట్సాప్, ఫేస్బుక్ లో ఇది వైరల్ అవుతుంది. ఆ బాలుడి హుషారు చూసి అయ్యేప్పే దిగి వస్తాడు అంటూ భక్తులు వ్యాఖ్యానిస్తూ ఆ బాలుడికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version