వైర‌ల్‌ వీడియో: ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయగానే పైక‌ప్పు ఊడింది..!

-

చాలామందికి ఇంట్లోకి వచ్చి రాగానే మొదట ఆన్ చేసే స్విచ్ ఏదంటే లైట్ కదా.. అ తర్వాత వెంటనే మన వేలు ఫ్యాన్ స్విచ్ మీద వేసేస్తాం కదా.. !!లైట్ స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది.. ఫ్యాన్ స్విచ్ వేస్తే ఫ్యాన్ కూడా తిరుగుతుంది.. కానీ ఒక ఇంట్లో మాత్రం ఫ్యాన్ స్విచ్ వేస్తే ఫ్యాన్ పైన ఉన్న సీలింగ్ కాస్త ఊడిపోయింది..అవును మీరు విన్నది నిజమే..!!

ఓ వ్య‌క్తి ఇంట్లోకి వెళ్లేముందు ఫ్యాన్ స్విచ్ వేశాడు. అంతే.. ఫ్యాన్ తిరగడం మాట దేవుడెరుగు. పైన ఉన్న సీలింగ్ అమాంతం వ‌చ్చి కింద ప‌డిపోయింది. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఫ్యాన్ కి ఏమి కాలేదు, స్విచ్ వేసిన అతనికి ఏమి కాలేదు. సీలింగ్ ఊదిన వెంటనే అత‌ను భ‌యంతో గ‌డ‌ప ద‌గ్గ‌రే ఉండ‌టంతో ప్ర‌మాదం ఏమీ జ‌ర‌గ‌లేదు. పైక‌ప్పు అంతా కింద‌ప‌డిన‌ప్ప‌టికీ ఫ్యాన్ పైనే ఉంది కానీ రెక్క‌లు మాత్రం కొంచెం కింద‌కి వంగిపోయాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.బహుశా దగ్గర నుండి చావు చూడడం అంటే ఇంతేనేమో కదా.. !!

Read more RELATED
Recommended to you

Exit mobile version