కింగ్ కోహ్లీ.. సచిన్‌ను మించిపోయాడు..!

-

విరాట్ కోహ్లీ.. అదరగొట్టాడు. భారత క్రికెట్ సత్తాను ప్రపంచానికి చాటాడు. వరల్డ్ రికార్డు సాధించి ఔరా అనిపించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా పది వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేవలం 205వ ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించాడు కోహ్లీ. దీంతో సచిన్ పేరిట ఉన్న పదివేల పరుగుల రికార్డును కోహ్లీ తిరగరాశాడు. 259వ ఇన్నింగ్స్‌లో సచిన్ ఆ రికార్డును అందుకున్నాడు. కాగా.. కోహ్లీ 54 ఇన్నింగ్స్‌ల ముందే మైల్‌స్టోన్ రీచయ్యాడు. వెస్టిండీస్‌పై జరుగుతున్న రెండో వన్డేలో 81 పరుగుల మార్క్ వద్ద కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.

కోహ్లీ, సచిన్ తర్వాత పదివేల పరుగుల మైలురాయిని సౌరవ్ గంగూలీ అందుకున్నాడు. ఆయన మూడో స్థానంలో ఉన్నాడు. ఇక.. కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఇదొక్క రికార్డే కాదు.. మరో రికార్డును కూడా సాధించాడు. 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెస్టిండీస్‌పై అత్యధిక రన్స్ చేసి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డులో కూడా సచిన్‌ను దాటేశాడు కోహ్లీ. 1573 పరుగులతో ఉన్న సచిన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version