జూన్ 2 నుంచి 29 వరకూ అమెరికా, వెస్ట్ ఇండీస్ వేదికగా జరగబోయే T20 వరల్డ్ కప్ 2024 కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.వెస్టిండీస్ స్లో వికెట్ పిచ్లు విరాట్ కోహ్లికి సూట్ కావని బీసీసీఐ భావిస్తుందని,T20 ప్రపంచకప్ ఇండియా జట్టు నుంచి విరాట్ కోహ్లిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే అవన్నీ రూమర్సే అని, టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపికలో విరాట్ కోహ్లి ముందు వరుసలో ఉన్నాడని ప్రముఖ క్రీడా వెబ్ సైట్ క్రిక్‌బజ్ తమ తాజా రిపోర్ట్‌లో పేర్కొంది. కాగా కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2024లో ఆర్సీబీ తరపున దుమ్ములేపుతున్నాడు.కేవలం 5 మ్యాచ్‌ల్లోనే ఓ సెంచరీ సాయంతో 316 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ఇటువంటి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆటగాడిని సెలక్టర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిక చేయకుండా వదిలేయరని క్రిక్‌బజ్ పేర్కొంది.