విరాట్ కోహ్లీ దూకుడును కొనసాగించాలి: అనిల్ కుంబ్లే

-

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ ఫామ్ పట్ల టీమ్ ఇండియా దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించారు. విరామం తర్వాత కూడా అంతకు ముందున్న దూకుడునే కోహ్లి కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. ‘విరాట్ తిరుగులేని ఫామ్లో కనిపిస్తున్నారు. అత్యుత్తమంగా ఆడుతున్నారు. అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. టీ20 వరల్డ్ కప్లో భారత్ తరఫునా ఇదే ఫాము కొనసాగించాలి’ అని అభిలషించారు.

కాగా, నిన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విరాట్ కోహ్లీ 47 బంతుల్లోనే 92 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 181 పరుగులు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version