ఎలా కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుంది…? అచ్చం సిగరెట్ పొగలానే అంటున్న నిపుణులు…!

-

కరోనా వైరస్ చాలా తీవ్రంగా వ్యాపిస్తోంది. ఎందరో మంది వైరస్ బారిన పడిపోతున్నారు. అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు ఈరోజు కరోనాకి సంబంధించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మామూలుగా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది అని మనం విన్నాం. అంటే బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరికీ వైరస్ వస్తుందని కాదు. యునైటెడ్ స్టేట్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ శుక్రవారం నాడు కరోనా వైరస్ వ్యాపించే విధానం గురించి చెప్పారు.

మొదటగా వైరస్ ఊపిరి పీల్చుకోవడం వల్ల, వైరస్ ఉన్నవాళ్ళని ముట్టుకోవడం వల్ల, గాలిలో ఉండే చిన్న చిన్న డ్రాప్లెట్స్ కారణంగా వైరస్ కి గురయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు. వైరస్ తో సతమతమయ్యే వాళ్ళు దగ్గినా, తుమ్మినా, మాట్లాడిన, శ్వాస తీసుకున్న ఇతరులకు వ్యాపిస్తుంది. అదే విధంగా వెంటిలేషన్ సరిగ్గా లేని గదుల్లో ఉండడం వల్ల కూడా ఇతరులకు వ్యాపిస్తుంది.

అయితే మనకి కనబడని అంత చిన్న చిన్న డ్రాప్లేట్స్ గాలిలో అరగంట నుంచి గంట పాటు వుంది.. ఆ వైరస్ ఇతరులకు సోకుతుంది. గాలి ద్వారా వ్యాపిస్తుంది అంటే మీరు ఎక్కడ ఉన్నా సరే గాలిలో వైరస్ వచ్చి మీకు కరోనా తెప్పిస్తుంది అని కాదు. ఒక వేళ కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి మీ గదిలో ఉండి సరైన వెంటిలేషన్ లేకుండా అతను దగ్గినా, తుమ్మినా దానివల్ల వచ్చే డ్రాప్లెట్స్ గాలిలో అరగంట నుంచి గంట పాటు ఉండి అది మీకు వ్యాపించడం జరుగుతుంది.

ఇది ఎలా అంటే ఒక వేళ ఎవరైనా సిగరెట్ స్మోకింగ్ చేసినప్పుడు అదే గదిలో మరొకరు ఆ వాసనని పిలుస్తారు. ఈ విధంగా వైరస్ కూడా వస్తుందని అంటున్నారు. ఒకవేళ కనుక సిగరెట్ స్మోకింగ్ చేసిన గంట తర్వాత మీరు ఆ గది లోకి వెళ్లినా అప్పుడు కూడా మీకు ఆ వాసన వస్తుంది.

ఇది సరైన ఉదాహరణ ఇలా గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. అదే విధంగా నిపుణలు ఇంకా ప్రజలకి మాస్క్ ఎలా ధరించాలో తెలియడం లేదు అని హెచ్చరిస్తున్నారు. సగంమంది మాస్క్ ధరించడం లేదని బయటకు వెళ్ళిన మాస్కు పెట్టుకోవడం లేదని సులువుగా వైరస్ మీకు వ్యాపిస్తుందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version