విశాఖలో అలర్ట్‌.. రైల్వేస్టేషన్‌ బంద్‌..

-

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ స్కీం అగ్గిరాజేస్తోంది. దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీంపై వ్యతిరేకంగా నిరసనలు చెలరేగుతున్నాయి. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా విశాఖపట్టణం రైల్వే స్టేషన్‌ను మూసివేశారు. భద్రతా కారణాల దృష్టా రైల్వే స్టేషన్‌ను మూసివేస్తున్నట్టు తెలిపారు అధికారులు. మధ్యాహ్నం 12 గంటల వరకు స్టేషన్ మూతలో ఉంటుందని, అప్పటి వరకు ఎవరినీ లోపలికి అనుమతించబోమని ప్రకటించారు అధికారులు.

కాగా, ఇప్పటికే బయలుదేరి విజయవాడ మీదుగా విశాఖపట్టణం చేరుకోవాల్సిన రైళ్లను దువ్వాడ వద్ద, హౌరా నుంచి వచ్చే రైళ్లను కొత్తవలస వద్ద నిలిపివేసి దారి మళ్లిస్తామని అధికారులు తెలిపారు. రైళ్లు విశాఖ రాకుండా ఏర్పాటు చేసి స్టేషన్‌లోకి ఎవరూ చొరబడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఉదయం ఏడు గంటల వరకు ఉన్న ప్రయాణికులను మాత్రం తనిఖీల అనంతరం స్టేషన్‌లోకి అనుమతించారు. స్టేషన్ వద్ద భారీగా బలగాలను మోహరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version