వనజంగి తక్కువ సమయం లోనే బాగా పాపులర్ అయిపోయింది. ప్రకృతి ప్రేమికులు ఈ ప్రదేశానికి వెళ్లాలని ఎంతగానో ఆరాటపడుతున్నారు. కొద్ది రోజుల్లోనే పెద్ద పర్యాటక స్థలంగా మారిపోయింది అంటే మామూలు విషయం కాదు. అయితే అసలు ఇక్కడ నిజంగా ఏముంది…?, అంత మంది దీని కోసం ఎందుకు వస్తున్నారు..? అసలు ఈ ప్రదేశం ఎక్కడ ఉంది…? ఇలా అనేక విషయాలు మీ కోసం. వనజంగి విశాఖపట్నం నుంచి వంద కిలో మీటర్ల దూరం లో ఉంది.
ఇప్పటి వరకు విశాఖపట్నం జిల్లాలో అరకు లంబసింగి హిల్ స్టేషన్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఈ ఏడాది ఈ జాబితాలో ఇది కూడా చేరింది. పాడేరు కి ఇది ఆరు కిలో మీటర్లు మాత్రమే. ఇక్కడ ట్రెక్కింగ్ చేసుకోవడానికి ట్రెక్కర్స్ విపరీతంగా వస్తున్నారు. మంచు, ప్రకృతి, కొండలు అందమైన ఊరు సూర్యోదయం ఇవన్నీ చెప్పుకుంటే కంటే చూస్తేనే బాగుంటుంది. పదాల్లో ఎంత చెప్పిన చూస్తేనే దాని అందం తెలుస్తుంది. మరి ఒక ట్రిప్ వేసేసి… వనజంగి ఎంత బాగుందో తెలుసుకోండి.