విశాఖ ఉక్కు ఆందోళనకు బిజెపి జనసేనలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ బీజేపీ లో భిన్న స్వరాలు వినిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..నిన్న సాయంత్రం ఢిల్లీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సుజనాచౌదరి ప్రైవేటీకరణ వలన ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పుకొచ్చారు..
కానీ విశాఖకు చెందిన బిజెపి నేతలు ఈ విషయం మీద కేంద్రంతో మాట్లాడి విశాఖ స్టీల్ ప్లాంట్ కు అన్యాయం జరగనివ్వమని చెబుతున్నారు.ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా స్టీల్ ప్లాంట్ ఆందోళనకు అనుకూలంగా అని ప్రకటన చేశారు. ఈ విషయం మీద ప్రధానిని త్వరలోనే కలుస్తామని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానివ్వమని చెప్పుకొచ్చారు.. అయితే కేంద్రం మీద బీజేపీ నేతలే ఆందోళనకు దిగడం ఆసక్తికరంగా మారింది..మరి బీజేపీ పెద్దలు దీని మీద ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.