విశాల్ కు చాలా పొగరు.. మోహన్ బాబు..

-

తమిళ హీరో విశాల్ నటించిన లాటి సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ వేడుకలు చెన్నైలో ఘనంగా జరిగాయి అయితే ఈ కార్యక్రమానికి హాజరైన మంచి మోహన్ బాబు హీరో విశాల్ గురించి తనదైన శైలిలో చెప్పకు వచ్చారు..

 

తాజాగా విశాల్ హీరోగా నటించిన లాటి సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు హాజరైన మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దాదాపు 8 ఏళ్ల నుంచి తమ కుటుంబానికి సంబంధించిన సినిమా వేడుకలకు తప్ప బయట ఎవరి ఫంక్షన్లకు వెళ్లట్లేదని చెప్పుకొచ్చారు కానీ విశాల్ ఎలాగైనా ఈ ఫంక్షన్కు రావాలని అడగటంతో కాదనలేక వచ్చాను అన్నారు మోహన్ బాబు..

అలాగే.. “తమిళనాడు నుంచి మన తెలుగు బిడ్డ విశాల్‌ ఇక్కడి వచ్చాడు. మనం ఆయన్ను ప్రేమించాలి, గౌరవించాలి. మా సినిమాలకు సంబంధించిన వేడుకలకు మినహా నేను 8 ఏళ్ల నుంచి బయటి వాటికి వెళ్లడంలేదు. విశాల్‌ చనువు తీసుకుని ‘అంకుల్‌.. తిరుపతిలో ఫంక్షన్‌ ఉంది. మీరు రావాలి’ అని కోరాడు. నేను వెంటనే ఓకే అని చెప్పా. ఆ కుటుంబంతో నాకున్న అనుబంధం అలాంటిది. విశాల్‌ తండ్రి నన్ను హీరోగా పెట్టి ‘యమ్‌ ధర్మరాజు: ఎంఏ’ అనే సినిమా తీశారు. ‘పందెం కోడి’లోని విశాల్‌ నటన నాకు బాగా నచ్చింది.. ఆయన మంచి కథలను ఎంపిక చేసుకుంటాడు. ‘ప్రేమ చదరంగం’, ‘పొగరు’లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలతో మెప్పించాడు. విశాల్‌కు నిజంగానే కొంచెం పొగరు ఉంది ఆ విషయం నాకు కూడా తెలుసు అయితే మనిషికి పవర్ ఉండాలి కానీ అది ఎదుటి మనిషికి హాని చేసేలా ఉండకూడదు.. ‘లాఠీ’ కానిస్టేబుల్‌ కథ. సమాజంలో ఏం జరిగినా ముందు తెలిసేది కానిస్టేబుల్‌కే. పోలీసు డిపార్ట్‌మెంట్‌ను నేను గౌరవిస్తా. ట్రైలర్‌ చూశా.. బాగుంది. ఈ సినిమా ‘పందెం కోడి’లా మంచి హిట్‌ అవుతుంది” అని అన్నారు మోహన్‌ బాబు..

Read more RELATED
Recommended to you

Latest news