Mark Antony : భయంకరంగా విశాల్‌.. ‘మార్క్ ఆంటోని’ ఫ‌స్ట్‌ లుక్ రిలీజ్

-

త‌మిళ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌మిళ్ ప్రేక్ష‌కుల‌కే కాకుండా.. తెలుగు లోనూ మంచి క్రేజ్ ఉన్న హీరో విశాల్‌. వ‌రుస‌గా విజ‌యాల‌తో… ప్ర‌స్తుతం దూసుకుపోతున్నారు విశాల్‌. కాగా ఇవాళ విశాల్‌ బర్త్‌ డే. ఈ నేపథ్యంలోనే.. విశాల్‌ నటిస్తున్న లెటెస్ట్‌ మూవీ మార్క్‌ ఆంటోని ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు.

ఈ సినిమాకు అదిక్‌ రవి చంద్రన్‌ దర్శకత్వం వహిస్తుండగా.. మినీ స్టూడియోస్‌ ఎల్‌ ఎల్‌పి బ్యానర్‌ పై ఎస్‌. వినోద్‌ కుమార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్‌ కుమార్‌ సంగీత స్వరాలు అందిస్తుండగా.. రీతూ వర్మ.. విశాల్‌ సరసన నటిస్తోంది. ఇక ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ లాంగ్వేజ్‌ లలో రిలీజ్‌ చేస్తున్నారు. అయితే.. తాజాగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌ లో విశాల్‌ ఉగ్ర రూపంలో కనిపిస్తున్నాడు. ఆ లుక్‌ చూసిన విశాల్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version