Vishal: విశాల్ నయా అవతార్..‘మార్క్ ఆంటోని’గా పాన్ ఇండియా ఫిల్మ్

-

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్..నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ ప్యారలల్ గా విడుదలవుతాయి. ఈ క్రమంలోనే విశాల్ కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. ‘పందెం కోడి’ సినిమాతో విశాల్ పాపులారిటీ బాగా పెరిగిందని సినీ పరిశీలకులు చెప్తుంటారు. అదిక్ రవి చంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో విశాల్ నయా లుక్ లో కనిపించనున్నాడు.

శుక్రవారం ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు ‘మార్క్ ఆంటోని’కి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. అదిక్ రవి చంద్రన్ ఈ సినిమాకు దర్శకుడు. కాగా, ఇందులో విశాల్ కు జోడీగా హీరోయిన్ గా రితూ వర్మ నటిస్తోంది.

ఇక సూపర్ హిట్ ఫిల్మ్ ‘డిటెక్టివ్’కు సీక్వెల్ తీస్తున్నాడు విశాల్. ఈ స్టార్ హీరో స్వీయ దర్శకత్వంలోనే సినిమా తెరకెక్కనుంది. ఈ పిక్చర్ పైన కూడా భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version