మూడో సారి ప్రేమ, పెళ్లి అంటున్న విశాల్..!!

-

 తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట ప్రేమ చదరంగం వంటి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు విశాల్. ఆ తర్వాత వచ్చిన పందెంకోడి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఒకేసారి తెలుగులో తమిళంలో కూడా మంచి క్రేజ్ సంపాదించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇటీవల హైదరాబాదులో లాఠీ సినిమా షూటింగ్లో కూడా గాయపడడం జరిగింది హీరో విశాల్. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్ తన ప్రేమ పెళ్లి వివాహం గురించి మాట్లాడడం జరిగింది. మొదట హీరోయిన్ వరలక్ష్మిని ప్రేమించి వివాహం చేసుకోవాలని అనుకున్నాడు విశాల్..కానీ కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోవడం కూడా జరిగింది. ఆ తరువాత 2019 వ సంవత్సరంలో నటి అనిషా తో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు త్వరలోనే వివాహం చేసుకుంటారు అనుకున్న సమయంలో కొన్ని కారణాల చేత కూడా వీరిద్దరు విడిపోవడం జరిగింది. స్వయంగా ఈ విషయాన్ని విశాల్ , ఆనిషా ప్రకటించడం జరిగింది. అయితే గతంలో విశాల్ మాట్లాడుతూ నడిగర్ సంఘానికి సంబంధించిన భవనం కట్టించాకే తాను వివాహం చేసుకుంటానని శబదం కూడా చేశారు.కానీ ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో త్వరలోనే వివాహం చేసుకోబోతున్నానని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా పెద్దలు కుదిరిచిన సంబంధాలు తనకి సెట్ అవ్వలేదని.. లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నానని తెలిపారు విశాల్. ప్రస్తుతం ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాను అని త్వరలోనే ఆమె ఎవరో చెప్తాను ఆమెనే వివాహం చేసుకుంటున్నానని తెలిపారు. మరి విశాల్ చేసుకోబోయే ఆ అమ్మాయి ఎవరో అంటూ ఆయన అభిమానులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి తన లవ్ విషయాన్ని అధికారికంగా ఎప్పుడు బయటపెడతాడు చూడాలి విశాల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version