సినిమా టికెట్ల ధరలపై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టిక్కెట్ల ధరలు తెలంగాణలో పెంచారు… ఏపీలో తగ్గించారు.. కానీ రెండు చోట్లా కోర్టుకు వెళ్లారన్నారు మంచు విష్ణు. దీనిపై సినీ పరిశ్రమ ఏకత్రాటి పైకి రావాలని పిలుపునిచ్చారు. టికెట్ల ధరల వివాదంపై తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందుకు వెళదాము… ఒకరిద్దరు మాట్లాడి దీనిపై వివాదం చేయడం సరికాదని పేర్కొన్నారు. రెండు ప్రభుత్వాలుతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాము… నేను విడిగా మాట్లాడి సమస్య పక్కదారి పట్టించలేనన్నారు.
రెండు ప్రభుత్వాలు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు… చర్చలు జరుగుతున్నాయి… కలిసి మెలసి ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. టిక్కెట్స్ ధరపై ఏర్పాటైన సబ్ కమిటీని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కలిసింది. వారు అడిగితే మేము కూడా కలుస్తామని ప్రకటన చేశారు. చిరంజీవి, జగన్ కలయిక పర్సనల్ మీటింగ్ అని… దానిని అసోసియేషన్ మీటింగ్ గా భావించకూడదన్నారు.
మా అసోసియేషన్ 100 రోజుల ప్రగతిపై త్వరలో మీడియాతో మాట్లాడుతానని చెప్పారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సినిమా టికెట్లపై నిర్ణయం తీసుకుంటుంది… వ్యక్తిగతంగా నా నిర్ణయంతో పని లేదు.. ఎవరూ నా అభిప్రాయం అడగడం లేదని స్పష్టం చేశారు. సినిమా టిక్కెట్స్ పై వైఎస్సార్ హయాంలోనే ఓ జీవో వచ్చింది… దానిపై కూడా చర్చ జరగాలన్నారు.