రాబోయే ఎన్నికల్లో వైసీపీ అజెండా ఏమిటో జగన్‌ చెప్పాలి : విష్ణువర్ధన్ రెడ్డి

-

మరోసారి సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అజెండా ఏమిటో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు విష్ణువర్ధన్ రెడ్డి. ఇటీవల మంత్రి ధర్మాన చేస్తున్న వ్యాఖ్యలను చూసినట్టయితే 2024 నాటికి ఏపీని రెండు లేదా మూడు రాష్ట్రాలు చేసేటట్టున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ధర్మాన మాట్లాడారని విమర్శించారు విష్ణువర్ధన్ రెడ్డి. 2024లో జగన్, ధర్మాన ఇద్దరి అజెండాలు ఒకటేనా అని ప్రశ్నించారు. ఇవి కేవలం ధర్మాన వ్యక్తిగత వ్యాఖ్యలేనా? లేక వైసీపీ లేదా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనా? అనే విషయంలో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర విభజనకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం పెట్టి, కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారా? అని ప్రశ్నించారు విష్ణువర్ధన్ రెడ్డి. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ధర్మానను మంత్రి పదవి నుంచి తొలగించాలని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలు ఉత్తరాంధ్ర ద్రోహుల్లా తయారయ్యారని, ప్రజల మధ్య తగాదాలు పెట్టి చలికాచుకోవాలనుకుంటున్నారని విమర్శించారు విష్ణువర్ధన్ రెడ్డి. ఏపీలో దోచుకోవడం, ఎన్నికల్లో పోటీ చేయడం మినహా మరేం జరగడం లేదని చెప్పారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే వైసీపీ పోవాలని, బీజేపీ రావాలని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version