విశ్వక్ సేన్ రాకీ ది మెకానిక్ రిలీజ్ డేట్ ఖరారు.. విడుదల ఎప్పుడంటే..?

-

మాస్ క దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఈ మధ్య కాలంలో గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విశ్వక్ ప్రస్తుతం మరో 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇందులో విడుదలయ్యే మొదటి చిత్రం ‘ రాకీ ది మెకానిక్.

ఇప్పటికే ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా.. తాజాగా రాకీ ది మెకానిక్ విడుదల తేదీ గురించి ప్రకటన వచ్చింది.డెబ్యూ డైరెక్టర్ రవితేజ్ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన రాకీ ది మెకానిక్ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న సినిమా రిలీజ్ కానుంది. త్వరలోనే ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం పాన్ ఇండియా హక్కులను ఏషియన్, సురేష్ సంస్థలు సంయుక్తంగా అందుకున్నారు.ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news