హంతకుడు వాలంటీర్ వెంకటేష్ కు ఏ అవార్డు ఇస్తారు – టీడీపీ ఫైర్‌

-

హంతకుడు వాలంటీర్ వెంకటేష్ కు ఏ అవార్డు ఇస్తారని టీడీపీ ఫైర్‌ అవుతోంది. విశాఖ కేజీహెచ్ మార్చురికి చేరుకున్నారు పెందుర్తి టీడీపీ నాయకులు. ఈ సందర్భంగా వాలంటీర్ చేతిలో హత్య కు గురైన మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా టిడిపి నేత బండారు అప్పలనాయుడు మాట్లాడుతూ… కొంతమంది వాలంటీర్ అన్యాయాలు చేస్తున్నారని.. ఇంట్లో ఏమి జరుగుతుందో వాలంటీర్లకు తెలుసు అన్నారు.

ఇక హత్య చేసిన వాలంటీర్ వెంకటేష్ కు ఏ అవార్డు ఇస్తారని మండిపడ్డారు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు…దీనిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సమాదానం చెప్పాలన్నారు. గతంలో ప్రభుత్వ మద్యం షాపులో తప్పు చేసిన వ్యక్తిని మళ్ళీ ఎలా వాలంటీర్ గా నియమించారని.. మంచి దొంగ,జగన్ మోహన్ రెడ్డి పచ్చబొట్టు వేసుకుంటే వాలంటీర్ గా నియమిస్తున్నారని ఆగ్రహించారు.క్రైమ్ బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయకుండానే వాలంటీర్ గా చేర్చుకుంటున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version