తెలంగాణలో విజృంభిస్తున్న కళ్ళ కలక కలకలం రేపుతోంది. ముఖ్యంగా కొమురం భీం జిల్లాలో 220 మందికి కల్ల కలక వచ్చింది. అటు మంచిర్యాల జిల్లాలో వందల సంఖ్యలో భాదితులు ఉన్నారు. వారం రోజులుగా జైపూర్, దండే పల్లి, కోట పల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో రిపోర్ట్ అవుతున్నాయి ఈ కేసులు.
ఇది వరకే జైపూర్ సోషల్ వెల్ఫేర్ లో 400 మంది విద్యార్థులకు కళ్ళ కలక వచ్చింది. హాస్టల్ లో ప్రస్తుతం 7 మంది భాదితులు ఉన్నారు. ఇక ఈ తరుణంలోనే జైపూర్ లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన చెన్నూర్ జడ్జి సంపత్ కుమార్..తగు చర్యలు తీసుకుంటున్నారు. అటు నిర్మల్ జిల్లా భైంసా లో 100 మంది కళ్ళ కలక భాదితులు ఉన్నారు.