గ్రేటర్ ఎన్నికల్లో కీలకంగా మారనున్న వరద బాధితుల ఓట్లు..!

-

గ్రేటర్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటలోపడ్డారు..ఇప్పటికే ప్రధాన పార్టీలు వరుస పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూరాజకీయ వేడిని సృష్టిస్తున్నారు..అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి అభ్యర్థికి ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్‌పై..ఆర్థికంగా బలంగా ఉన్నారా? లేదా? అన్న అంశాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు..మరోవైపు జనసేన, టీడీపీ పార్టీలు కూడా పోటీలో ఉంటామనడంతో శీతాకాలంలో గ్రేటర్‌లో రాజకీయం మరింత హీటెక్కిస్తుంది.

నామినేషన్లకు మరో రెండు రోజులే సమయం ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు..నిన్న బీజేపీ రాష్ట్ర కమిటీ మీటింగ్‌ పెట్టుకొని అభ్యర్థుల తొలి జాబితాను సిద్దం చేసినట్లు తెలుస్తుంది..నేడో రేపే అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది కమలం పార్టీ..మరో వైపు టీఆర్‌ఎస్‌ కూడా తన దూకుడు పెంచింది..అభివృద్ది పనులకు శంకుస్థానలు చేస్తు నిన్నటి వరకూ గ్రేటర్‌ అభివృద్ధిపై ఫోకస్‌ పెట్టిన కేటీఆర్‌..ఇప్పుడు అభ్యర్థుల ఎంపికలో బీజీబిజీగా ఉన్నారు..అభ్యర్థుల ఎంపికలో ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చిన గులాబీ బాస్‌ ఈ రోజు పార్టీ ముఖ్య నేతలలో భేటీ కానున్నారు..ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
ఈ సారి గ్రేటర్‌ ఎన్నికల్లో వరదసాయం పొందని వారి ఓట్లు కీలకంగా మారనున్నాయంటున్నారు విశ్లేషకులు..ఇటీవలే హైదరాబాద్‌లో వచ్చిన వరదలతో నగర ప్రజలు ఇబ్బందులు పడ్డారు..చాలా మంది నాలాలో పడి మృతి చెందారు..ఇళ్లు, వాహనాలపై ప్రకృతి తన ప్రతాపాన్ని చూపింది..వరదలపై రంగంలోకి దిగిన ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.10 వేల వరద సాయం ప్రకటించింది..వరదసాయం అందరికి అందించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని..వరద సాయంలో అనేక అవినీతి జరిగిందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి..ఇప్పుడు ప్రతి పక్షాలకు అదే ఎన్నికల అస్త్రంగా మారనుంది.

మరోవైపు గ్రేటర్‌లో దిద్దుబాటు చర్యలు చేపట్టిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం..ఎన్నికల తాయిలాలను ప్రకటించింది..మున్సిపల్ ఉద్యోగుల జీతాల పెంపు..నగరంలో ఆస్తి పన్ను తగ్గింపు..ఆర్టీసీ ఉద్యోగుల జీతాల చెల్లింపు వట్టి నిర్ణయాలు తీసుకుంది..దీంతో వరదసాయం అందని వారి కోసం మరో అవకాశం ఇస్తూ..సాయం అందని వారు మీసేవ సెంటర్‌లో దరఖాస్తు చేస్తుకునేందుకు అవకాశం ఇచ్చింది..ఇది ప్రభుత్వంపై ప్రజల్లో మరింత వ్యతిరేఖను తీసుకువచ్చేలా ఉందంటున్నారు విశ్లేషకులు..లక్షల మంది బాధితులు మీసేవ సెంటర్ల ముందు ఉదయం 3 గంటల నుంచే క్యూలో నిల్చుంటున్నారు..అయినా వారి లైన్‌ వచ్చే వరకే దరఖాస్తు ఫారాలు అయిపోయాని చెప్పడంతో చాలా మంది నిరాశతో వెనుదిరుగుతున్నారు.

ఇది ప్రజల్లో టీఆర్‌ఎస్ పార్టీపై వ్యతిరేఖ భావనను కలిస్తుంది..చాలా పార్టీలకు వారివారి పార్టీలకు ఫిక్స్‌డు ఓటు షేరింగ్ ఉంటుంది..వారు ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఆయా పార్టీలకు ఓటు వేస్తారు..ఏ పార్టీతో సంబంధం లేనివారే ఈ వరద బాదితులు..వీరి ఓట్లే గ్రేటర్ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి..ఈ ఎన్నికల్లో వీరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో వారు గ్రేటర్ పీఠం గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి..అందుకు ప్రధాన ప్రతి పక్షాలు వరద బాధిత ఓటర్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి..టీఆర్‌ఎస్‌ పార్టీ బాధితులకు వీలైంత త్వరగా సాయం అందించి..వారి సమస్యలను పరిష్కరించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవ తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version