ఈ పులి రావడం మంచిదే.. అధికారుల ప్రకటన !

-

దాడి చేసింది తప్పించుకుంది మళ్ళీ ఎవరికీ కంట పడలేదు. ఎక్కడ వెతికినా దాని జాడ ఎంతవరకు కనిపెట్టలేకపోయారు ఆసిఫాబాద్ జిల్లా అటవీశాఖ అధికారులు. అయితే మహబూబాబాద్ జిల్లాలో బెంబేలెత్తిస్తున్న పులి గురించి మాత్రం అటవీశాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. తాజాగా గూడూరు- కొత్తగూడ అటవీప్రాంతంలో పులి సంచారం జరుగుతుదని గుర్తించారు అధికారులు. ఒక అడవి పందినీ, మేకను చంపి తిన్నట్లుగా గుర్తించారు.

గుంజేడు ముసలమ్మ ఆలయ పరిసర ప్రాంతంలో పులి పాదముద్రలు పరిశీలించిన అటవీశాఖ అధికారులు ఒక ఆడపులి సంచరిస్తుందని నిర్దారణకు వచ్చారు. అంతే కాదు ఆడపులి రావడం శుభసూచకమని ప్రకటన చేసిన అధికారులు ఎవరూ అడవుల్లోకి వెళ్లవద్దని, పశువులను మేతకు అడవికి తీసుకువెళ్లవద్దని హెచ్చరికలు చేశారు. అయితే అధికారులు చేసిన ఈ ప్రకటనతో పరిసర గ్రామాల ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే అధికారులు చేసిన ఈ ప్రకటన వెనుక అర్ధం ఏమి అయి ఉంటుందా ? అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version