వివాహం తర్వాత కూడా తగ్గేదేలే అంటూ అందాల ఆరబోతలో దూసుకుపోతోంది మెగా డాటర్ నిహారిక. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోస్ తో కుర్రకారును బాగా ఆకట్టుకుంటుంది. గ్లామర్ పిక్స్ తో పాటు జిమ్ ఫోటోలు కూడా షేర్ చేస్తూ అభిమానులకు మంచి హాట్ ట్రీట్ ఇస్తోందని చెప్పవచ్చు.. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది . ముఖ్యంగా నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే మరొకపక్క ఎక్కడున్నా సరే ఫన్నీగా సెటైర్లు వేస్తూ అందరిని అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు అప్పుడప్పుడు బుల్లితెర కార్యక్రమాలకు కూడా హాజరవుతూ ఉంటుంది.
ఇదిలా ఉండగా నిహారిక గురించి గత కొన్ని రోజులుగా తరచూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది. అలాగే కొన్ని వివాదాలలో కూడా ఈమె చిక్కుకుంటుంది. మొన్నా మధ్య ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ రైడ్ లో నిహారిక పేరు కూడా వినిపించి సంచలనం సృష్టించింది. అయితే నిహారిక ఆ పబ్ కి కేవలం తన ఫ్రెండ్ బర్తడే పార్టీ కోసం మాత్రమే వెళ్లిందని పోలీసులు కూడా ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చారు. నిజానికి వివాహం తర్వాత ఈమె జోరు తగ్గలేదని చెప్పాలి. సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్, జిమ్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తోంది. ఈ మధ్యకాలంలో మరియు ముఖ్యంగా లో అందాలు కనిపించే విధంగా డ్రస్సులు ధరించడమే కాకుండా వాటిని అభిమానులతో షేర్ చేసుకొని మరింత హాట్ గా తయారయింది.
ఇక ఈమధ్య బికినీలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మెగా డాటర్ కాబట్టి విమర్శలు వస్తాయని తెలిసినప్పటికీ ఈ అమ్మడు ఇలా బికినీలో కనిపించడం మరొక హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల టర్కీ కి తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లిన ఈమె అక్కడ హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఒక స్ట్రేంజర్ గర్ల్ తో బికినీలో సెల్ఫీకి ఫోజు ఇచ్చింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి.